Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Chaalunu Loaka Bhoagamulu Chaalunu Chaalu

చాలును లోక భోగములు చాలును చాలు

Chaalunu Loaka Bhoagamulu Chaalunu Chaalu

Lyricist: Bethala John
Chorus
చాలును లోక భోగములు చాలును చాలును మీనమును బట్టు
గాలమైయున్న భోగములు‖ చాలును ‖
Verse
ఎండమావులే నీరనుచు మెండుగఁ బరుగిడు జింక కుప మండనై
బలహీను నైతిఁ‖ చాలును ‖
Verse
బూరుగ పండారగింపఁ గోరి కాచికొని యున్నట్టి కీరసామ్య మైతి
నయ్యో‖ చాలును ‖
Verse
దీపపు దీప్తి నాశించి యూపిరి విడు పురుగు రీతిఁ బాపపు భ్రమచే
నట్లయితిఁ‖ చాలును ‖
Verse
పూలతో ఁటయందుఁ బెరుగు బూరుగ వృక్షంబునై నే మేలునకు
మూలముగాన నైతిఁ‖ చాలును ‖
Verse
చల్లిన వితనము ల్జంపు చౌట భూమి వలె నేఁ గాఁగ సత్యము
నిష్ఫలమయ్యొ నకట‖ చాలును ‖
Verse
మాయ సంత నైతి యేసు నాయక నన్విడక మార్పు జేయుమి నెన
రుంచి నాపైఁ‖ చాలును ‖
Verse
తొల్లి నన్ రప్పించినట్టి చల్లని సువార్త తేజ ముల్లమందు నుండఁ జేయ‖ చాలును ‖
Verse
మంచు పోల్కె ననుఁ జేయుటకై ముంచుమీ నీ రక్తాంబుధిలోఁ బెంచుమి
నీ వాక్సారము చేఁ‖ చాలును ‖
Verse
చెడ్డ బిడ్డ నయ్య నేను దొడ్డ రక్షకుండ వీవు అడ్డులేక నన్నుఁ
బ్రోవు‖ చాలును ‖

Related Tags

RepentanceSurrenderRenunciation