Verse
చాటించుఁడి మనుష్యజాతి కేసు
నామము
చాటించుఁడి యవశ్య మేసు
ప్రేమ సారము
జనాదులు విశేష రక్షణసునాదము
విను పర్యంతము.
చాటుదము - చాటుదము
చాటుదము - చాటుదము
చాటుదము - చాటుదము
శ్రీ యేసు నామము‖ శ్రీ యేసు నామము ‖
Verse
కన్నీళ్లతో విత్తెడువార లానందం
బుతో
నెన్నఁడు గోయుదు రనెడి వాగ్ద
తంబుతో
మన్నన గోరు భక్తులార నిండు
మైత్రితో
మానవ ప్రేమతో
చాటుదము - చాటుదము
చాటుదము - చాటుదము
చాటుదము - చాటుదము
చక్కని మార్గము‖ చక్కని మార్గము ‖
Verse
సమీపమందు నుండు నేమో
చావుకాలము
సదా నశించిపోవువారి కీ
సుభాగ్యము
విధంబుఁ జూపఁగోరి యాశతోడ
నిత్యము
విన్పించుచుందము.
చాటుదము - చాటుదము
చాటుదము - చాటుదము
చాటుదము - చాటుదము
సత్య సువార్తను‖ సత్య సువార్తను ‖