Chorus
చాటుఁడి శుభవార్తను బోధకులారా చాటుఁడి శుభవార్తను జాటుఁ
డి శుభవార్త సకల రాష్ట్రములలోఁ జాటించుఃడని చెప్పె ఢాటిగఁ ప్రభు
యేసు‖ జాటుఁడి ‖
Verse
లోకమును ప్రేమించి లోకరక్షణ కొఱకు ప్రాకటంబుగ సుతునిఁ
బంపె దేవుఁడటంచుఁ‖ జాటుఁడి ‖
Verse
శత్రువుల రక్షింప మిత్రుఁడుగా వచ్చి మైత్రి నసుపు నిచ్చి మరల
లేచెన టంచుఁ‖ జాటుఁడి ‖
Verse
ఎట్టి పాపు లైనఁ బట్టి యేసుని మాట దిట్టముగ నమ్మినఁ బట్టుగ
క్షమియించుఁ‖ జాటుఁడి ‖
Verse
హృదయ శుద్ధిని గోరి సదయుఁడగు రక్షకునిఁ పదిలముగఁ ప్రార్ధింపఁ
పరిశుద్ధాత్మ నొసంగుఁ‖ జాటుఁడి ‖
Verse
నమ్మి బాప్తిస్మంబు నెమ్మిఁ బొందిన మనుజు లిమ్ముగఁ బొందుదు
రిలను ఘన రక్షణముఁ‖ జాటుఁడి ‖
Verse
ఇందు నందు మికుఁ బొందుగ నొసఁగును సందియము లేకుండ సకల
భాగ్యము లనుచుఁ‖ జాటుఁడి ‖