Chorus
చేడియలు గుంపుగూడిరి క్రీస్తు జాడఁ గని తాల్మి నీడిరి ఆడికలనోర్చి
నేఁడు మన పాఁలి వాఁడుసిలువ ను న్నాడు గదె యంచు‖ చేడియలు ‖
Verse
వారి మొగములు వాడెను యేసు వారి వెత లెల్ల జూడను నీరు
దృక్సర సీరుహములందు జార తమ కొన గోరులను మీటి‖ చేడియలు ‖
Verse
రొమ్ములను జేతు లుంచుచు చింత గ్రమ్మి నిట్టూర్పు లిచ్చుచు
కొమ్మలట నిల్పు బొమ్మలన చేష్ట లిమ్ముచెడి యబ్బు రమ్ముతో నిల్చి‖ చేడియలు ‖