Verse
చక్కనైన దారి నీవే
చేరువైన తోడు నీవే‖ 2x ‖
యేసయ్యా నీవే చాలయ్యా
నా బ్రతుకునందు ఎన్నడూ వీడిపోకయ్యా‖ 2x ‖
Verse
చిన్న చిన్న బాధలకే భయపడిపోయానయ్యా
జయమే లేదనుకొని ఏడ్చినానయ్యా‖ 2x ‖
యేసయ్యా ఆశ్రయం నీవైనావయ్యా
యేసయ్యా భుజంపై చెయ్యేసావయ్యా
నీ ప్రేమనెవరు ఆపలేరయ్యా
ఎంత ఉపకార బుద్ధి నీదయ్యా‖ 2x చక్కనైన ‖
Verse
అడిగినదానికన్నా అధికం చేసావయ్యా
నీ స్థానం ఎవ్వరికి చెందనీనయ్యా‖ 2x ‖
యేసయ్యా గుప్పిలి విప్పుచున్నావు
యేసయ్యా అందని వాడవు కావు
సమీపమైన బంధువువి నీవు
నీ ఆత్మతో దీవించుచున్నావు‖ 2x చక్కనైన ‖