Verse
చలి రాతిరి ఎదురు చూసే
తూరుపేమో చుక్క చూపే
గొల్లలేమో పరుగునొచ్చె
దూతలేమో పొగడ వచ్చె
పుట్టాడు పుట్టాడురో రారాజు
మెస్సయ్యా పుట్టాడురో మన కోసం‖ 2x ‖
పశుల పాకలో పరమాత్ముడు
సల్లని సూపులోడు సక్కనోడు
ఆకాశమంత మనసున్నోడు
నీవెట్టివాడవైనా నెట్టివేయడు‖ 2x ‖
సంబరాలు సంబరాలురో
మన బ్రతుకుల్లో సంబరాలురో‖ 2x చలి ‖
చింతలెన్ని ఉన్నా చెంత చేరి
చేరదీయు వాడు ప్రేమగల్లవాడు
ఎవరు మరచినా నిన్ను మరవనన్న
మన దేవుడు గొప్ప గొప్పవాడు‖ 2x ‖
సంబరాలు సంబరాలురో
మన బ్రతుకుల్లో సంబరాలురో‖ 2x చలి ‖