Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Chalina Devudavu Yesu Chalina Devuda Neevu

చాలిన దేవుడవు యేసు చాలిన దేవుడ నీవు

Chalina Devudavu Yesu Chalina Devuda Neevu

Verse
చాలిన దేవుడవు యేసు చాలిన దేవుడ నీవు
వ్యాధి బాధ సమయములో కష్టసుడుల తరంగములో
ఏమున్నా లేకున్నా ఏ స్ధితికైనా చాలిన దేవుడ నీవే
Verse
అంజూర చెట్లు పూయకున్నను ద్రాక్ష చెట్లు ఫలింపకున్నను
చేనులోని పైరు పండకపోయినను
శాలలోని పశువులు లేక పోయినను
Verse
గాఢాంధకారాన పయనించిన పొంగు సాగరా లెదురైన
లోకమంత ఒకటైన అన్యాయ తీర్పుకు గురిచేసిన
సత్యము పలుకుటచే నష్టము కలిగినను
Verse
దారిచెడినపుడు యేసయ్య అందరు విడచిన యేసయ్యా
శాశ్వతమైన ప్రేమతో కన్నీళ్ళు తుడిచితివే
ననునీచుడని త్రోయక నీ కౌగిట దాచితివే

Related Tags

WorshipFaithComfort