Chorus
చాలునయ్యా చాలునయ్యా
నీ క్రప నాకు చాలునయ్యా‖ 2x ‖
ప్రేమామయుడవై ప్రేమించావు
కరుణమయుడవై కరుణించావు‖ 2x ‖
తల్లిగాలాలించి తండ్రిగాప్రేమించి‖ 2x ‖
ప్రేమా.. కరుణా.. నీ క్రపచాలు‖ 2x ‖
Verse
జిగటగల ఊబిలో పడియుండగా
నీ అడుగులు స్థిరపరచి నిలిపితివి‖ 2x ‖
హిస్సోపుతో నన్ను కడుగుము యేసయ్య
హిమముకంటెను తెల్లగమార్చయ్య
నీకేమి చెల్లింతు నా మంచి యేసయ్య
నా జీవితమంత అర్పంతునీకయ్య
ప్రేమా.. కరుణా.. నీ క్రపచాలు‖ 2x ‖
Verse
బంధువులు స్నేహితులు త్రోసేసినా
తల్లిదండ్రు లేనన్ను వెలివేసినా‖ 2x ‖
నన్ను నీవు విడువను లేదయా
మిన్నగ ప్రేమించి రక్షించినావయ్యా
నీకేమి చెల్లింతు నామంచి యేసయ్యా
నీకేమి చెల్లింతు నా మంచి యేసయ్యా
నీసాక్షిగా ఇల జీవింతునయ్యా
ప్రేమా.. కరుణా.. నీ క్రపచాలు‖ 2x ‖