Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Chandamaama Chandamaama

చందమామ చందమామ

Chandamaama Chandamaama

Lyricist: Asha Ashirwadh Shaik
Verse 1
చందమామ చందమామ
రాజు పుట్టాడంట ఓయమ్మా
వెన్నెలమ్మిది నిజమా
అతన్నికన్నా సుందరుడంటమ్మా
నవ్వుల పసిబాలూడోయమ్మ
అధ్వితీయుడే అరుదించడమ్మా
నశియించే మనకోసం ప్రేమించి ఇలా వచ్చాడమ్మా
రండయ్యో రండమ్మా స్వాగతీద్దాం
మన హృదయంలోనే వేదికేదాం
సంతోష సంబరాలు చేసేదాం
మనమంతా కలిసి పండుగ చేదాం
Verse
యూదయ దేశమున బేత్లేహేము గ్రామమున
ఓ గొప్ప వెలుగు ప్రకాశించే
ఏమిటని సూడబోతే ఓ దూత ఎదురుపడి
మెస్సయా పుట్టాడని వార్త చెప్పే
పరుగున పరుగున సూడ వెళ్ళామే
రారాజునే దర్శించామే
ఆ సుందరుని హృదిలో మేము నిండామే
ఎంత భాగ్యమిదని గొల్లలు పాడారే
Verse
ఓరోరి సిన్నవాడా సూడరా గొప్ప తార
మనరాజు పుట్టే సూచనరా
ఆరా తెదామురా పండుగ చేదమురా
విలువైనవన్నీ అర్పిదామురా
అంటూ జ్ఞానులే చూడ వెళ్లారే
ఆ గొప్ప రాజుని పూజించారే
దేవధూతలే మహిమతో నిండారె
ఎంత అద్భుతమిదని పరవశించారే

Related Tags

ChristmasNativityCelebration