Chorus
చేద్దామా పోరాటం ఆత్మీయ పోరాటం - అపవాది శక్తులతో అనుదినము పోరాటం‖ 2x ‖
ఏనాడో గెలిచాడు యేసు దేవుడు - శత్రువుని మన పక్షాన
అపవాది తల త్రొక్కి లేచినాడుగా - మనకివ్వ విజయాన్ని....... యే యే యే యే యే
యేసు రక్తమే జయం జయం - అపవాది క్రియలకు అనంత నాశనం‖ 2x ‖
చేద్దామా పోరాటం ఆత్మీయ పోరాటం - అపవాది శక్తులతో అనుదినము పోరాటం‖ 2x ‖
Verse
మేం చేసే ఈ యుద్ధం శరీరులతో కాదు - ఆకాశ దురాత్మలతో శక్తులతోనే పోరు‖ 2x ‖
ప్రధానుల్ అధికారులెవరైన - అంధకార సంబంధ నాధులైన
యేసయ్య నామంలో వంగాలి - యేసయ్య నామంలో ఓడాలి
యేసయ్య నామంలో వంగాలి ఓడాలి - ప్రభుకే మ్రొక్కాలి
Chorus
యేసు రక్తమే జయం జయం - అపవాది క్రియలకు అనంత నాశనం‖ 2x ‖
చేద్దామా పోరాటం ఆత్మీయ పోరాటం - అపవాది శక్తులతో అనుదినము పోరాటం
Verse
అపవాది తంత్రాలు మేం ఎరుగని వారము కాము - మా నోటి సాక్ష్యముతో ప్రభు రక్తముతో గెలిచెదము‖ 2x ‖
సర్వాంగ కవచాన్ని ధరియించి - విశ్వాస డాలును ముందుంచి
అపవాది అగ్ని బాణాలార్పేస్తాం - శ్రమ శోధన దూషణలన్నిటి జయిస్తాం
అపవాది అగ్ని బాణాలార్పేస్తాం గెలిచేస్తాం ప్రభునే స్తుతిస్తాం
Chorus
యేసు రక్తమే జయం జయం - అపవాది క్రియలకు అనంత నాశనం‖ 2x ‖
చేద్దామా పోరాటం ఆత్మీయ పోరాటం - అపవాది శక్తులతో అనుదినము పోరాటం
Verse
హృదయానికి ప్రభువిచ్చాడు నీతి అనే కవచం - ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోపరచి చెరపడతాం‖ 2x ‖
దేవుని నీతి మేం అగునట్లు - మా నీతి ప్రభువే అయ్యాడు
సింహంలా ధైర్యముగా మేముంటాము - ఏడు మార్లు పడినా తిరిగి లేస్తాము
సింహంలా ధైర్యముగా మేముంటాము లేస్తాము ప్రభునే చూస్తాము
Chorus
యేసు రక్తమే జయం జయం - అపవాది క్రియలకు అనంత నాశనం‖ 2x ‖