Verse
చీకటి కాలము వచ్చుచుండె - కృపకాలము నుపయోగించు
తలుపులు తెరచియుండగనే - విరిగిన మనస్సుతో సాగెదవా?
Chorus
తలుపులు తెరచియుండగనే - విరిగిన మనస్సుతో సాగెదవా?
కాలమపాయముగా నుండె - సమయము సద్వినియోగించు
Verse
బీడుభూములధికముగా - చూచిన నీవు సాగిరా
యేసుని వారికి చూపించు - ప్రేమా వార్తను చాటించు
Verse
ఎన్నో రాజ్యము లీనాడు - దేవుని పనికి మూయబడె
తెరచిన తలుపులు యెదురుండన్ - ప్రవేశింతురు జ్ఞానులు
Verse
విశ్వాసుల సహవాసమున - ప్రేమా ఐక్యతగలదు
అని చెప్పెడి దినములు - మన మధ్యకు రావలెను
Verse
రానై యున్న భాధ్యతలు - మనకధికము ప్రియులారా
మనకు జయము కలుగుటకై - వినమున పోరాడెదము
Verse
మాదు హృదయముల నింపు - నీదు ప్రేమతో మా ప్రభువా
హిందూ దేశపు వీధులలో - నాథా నిన్నే చాటెదము