Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Cheekati Loyalo Nenu Padiyundaga Neve

చీకటి లోయలో నేను పడియుండగా నేవే

Cheekati Loyalo Nenu Padiyundaga Neve

Verse
చీకటి లోయలో నేను పడియుండగా
నేవే దిగివచ్చి నన్ను కనుగొంటివి
మరణపు గడియలో నేను చేరియుండగా
నీ రక్తమిచ్చి నన్ను బ్రతికించితివి
నీవే, దేవా నీవే, నీవే నీవే
నా ప్రాణదాతవు నీవే ప్రభు
చేర్చు దేవా చేర్చు, నన్ను చేర్చు
ఎత్తెన కొండపైకి నన్ను చేచ్చు
Verse
అరణ్యములో నేను సంచరించినను
ఏ అపాయమునకు భయపడను
నీవే నా మార్గమని నిన్ను వెంబడించెదను
నా చేయిపట్టి నన్ను నడిపించుము
నీకే, దేవా నీకే, నీకే నీకే
నా సమస్తమును నీకే అర్పింతును
చేర్చు దేవా చేర్చు, నన్ను చేర్చు
నా తండ్రి ఇంటికి నను చేర్చు ప్రభు
Verse
ఆకలి దప్పులు లేని శ్రమలు అలసటలు లేని
శోధన అవేదన లేని భయము దుఃఖములేని
మరణం కన్నీరు లేని చీకటి ప్రవేశం లేని
నా తండ్రి ఇంటికి నన్ను చేర్చు ప్రభు
సకల సమృద్ధి ఉండు దూతల స్తుతిగానాలుండు
భక్తుల సమూహముముండు మహిమ ప్రవాహముండు
నిత్యం ఆరాధన ఉండు శాశ్వత ఆనందముండు
నా తండ్రి ఇంటికి నన్ను చేర్చు ప్రభు

Related Tags

WorshipComfortSalvation