Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Cheekatine Tholaginchinadi

చీకటినే తొలగించినది

Cheekatine Tholaginchinadi

Lyricist: Kranthi Chepuri
Verse
ప్రేమా … ప్రేమా…
యేసూ… నీ ప్రేమా‖ 2x ‖
Verse
చీకటినే తొలగించినది
లోకమునే వెలిగించినది
మరణము గెలిచి మార్గము తెరచినది
పాపిని నను ప్రేమించినది
వెదకి నను రక్షించినది
నీతిమంతునిగా ఇల మార్చినది
Chorus
యేసయ్యా యేసయ్యా నీ ప్రేమే చాలయ్యా
ప్రేమించే నీ మనసే నా అతిశయమయ్యా
యేసయ్యా యేసయ్యా నీ కృపయే మేలయ్యా
కృపతోనే రక్షించి కాపాడితివయ్యా
Chorus
ఆరాధన స్తుతి ఆరాధన
ఆరాధన నీకే
ఆరాధన స్తుతి ఆరాధన
ఈ స్తోత్రార్పణ నీకే
Chorus
యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా
యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా‖ 2x చీకటినే ‖
Verse
దేవా… నా దేవా…
దేవా… నా ప్రభువా‖ 2x ‖
Verse
నీ కొరకే నే బ్రతికెదను
నీ ప్రేమను కనుపరచెదను
నీ సాక్షిగ ఇల జీవించెదనయ్యా
నీ సువార్తను చాటెదను
నిన్నే నే కీర్తించెదను
నీ సేవలో నే కొనసాగెదనయ్యా
Chorus
యేసయ్యా యేసయ్యా నా గురి నీవయ్యా
నిను చూసే క్షణమునకై వేచియున్నానయ్యా
యేసయ్యా యేసయ్యా నా రాజువు నీవయ్యా
నీ రాజ్యములో చేరుటకు కనిపెట్టుకుంటానయ్యా
Chorus
ఆరాధన స్తుతి ఆరాధన
ఆరాధన నీకే
ఆరాధన స్తుతి ఆరాధన
ఈ స్తోత్రార్పణ నీకే
Chorus
యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా
యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా‖ 2x నీ కొరకే ‖

Related Tags

PraiseWorshipSalvation