Verse
చీకటులే నన్ను కమ్ముకొనంగా
దుఃఖంబు నాకాహారంబు కాగా
ఏకాకినై లోకంబులోన
కనిపెట్టుకొనియుందు నీ రాక కొరకు‖ 2x ‖
Verse
మేఘములు నన్ను ముసుగుకొనంగా
ఉరుములు నాపై దొరలుచుండంగా
వడగండ్ల వాన కురియుచుండంగా
కనిపెట్టుకొనియుందు నీ రాక కొరకు‖ 2x ‖
Verse
అన్యాయ క్రియలు అధికంబు కాగా
మోసంబులే నాకు వ్యసనంబు కలుగ
ఆకాశ శక్తులు కదలించబడగా
కనిపెట్టుకొనియుందు నీ రాక కొరకు‖ 2x ‖
Verse
త్వరలోనే రమ్ము పరలోక వరుడా
వరమేని తనయా ఓ గొర్రెపిల్లా‖ 2x ‖
కడబూర మ్రోగన్ తడవేల ప్రభువా‖ 2x ‖
కనిపెట్టుకొనియుందు నీ రాక కొరకు‖ 2x చీకటులే ‖