Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Cheppanaa Cheppanaa Yesu Nee Premanu

చెప్పనా చెప్పనా యేసు నీ ప్రేమను

Cheppanaa Cheppanaa Yesu Nee Premanu

Verse
చెప్పనా చెప్పనా యేసు నీ ప్రేమను
చూపనా చూపనా మార్చిన బ్రతుకును
గుండెల్లో గుడి కట్టి యేసయ్యకివ్వనా
ప్రాణమే పెట్టిన ఈ ప్రేమ మరుతునా‖ 2x చెప్పనా ‖
Verse
చీకటి రాత్రిలో చీరు దీపమైన లేక
ఏ ఒడ్డుకు చేరుతానో తెలియని వేళ
కంటినిండ కన్నీళ్ళతో బరువెక్కిన గుండెతో
అయిపోయిందంతా అనుకున్నవేళ
నా చేయి పట్టావు నా వెన్నుతట్టావు
నేనున్నానని నన్ను నిలబెట్టావు‖ చెప్పనా ‖
Verse
నిందలన్ని తొలగించి ఆనందము నాకిచ్చి
బాధ కలుగు దేశమందు బలమిచ్చావు
ఒంటరైన నన్ను చేర్చి పదివేలుగ నన్ను మార్చి
అవమానము తొలగించి బలపరిచావు
అంతులేని ప్రేమ చూపి హద్దులేని కృపనిచ్చి
నీ చల్లని నీడలో నను దాచావు‖ చెప్పనా ‖

Related Tags

PraiseWorshipJesus Love