Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Cheri Bhujiyimpudeevindu Yesu Siddhaparachina

చేరి భుజియింపుడీవిందు యేసు సిద్ధపరచిన

Cheri Bhujiyimpudeevindu Yesu Siddhaparachina

Lyricist: V D John Sundara Rao
Verse
చేరి భుజియింపుడీవిందు యేసు సిద్ధపరచిన కృపావిందు తోరణంబగు
మేడ గదిలో జేరి శిష్యుల తోడ సిలువ భారమున్ మదినెంచి నెరపిన
భావ గర్భితమైన విందు‖ చేరి ‖
Verse
జీవాహారము దైవసుతుడే పరమ జీవజలముల దాత యితడే
జీవనాధుని రక్త మేనులు జీవానాహారములు కాగా చావును దొల గించి
మృతులస జీవులనుగా మార్చువిందు‖ చేరి ‖
Verse
కారుణ్యనిధి యేసు రాజు నరుల గావగ బలియైన రోజు భారమైన
సిలువ కెరయై పాప భారము పరిహరింప ధారవోసిన పుణ్యరక్తపు
ధారలన్ దలపోయు విందు‖ చేరి ‖
Verse
దాసగణముల బ్రోవనెంచి రుధిర ధారలను గార్చిభరించి భాసు
రంబగు నవ నిబంధన జేసి సంఘ పునాది వేసి వాసి మీరగ నిత్య
జీవము బోసినట్టి యేసు విందు‖ చేరి ‖
Verse
పాప పరిహారార్థముకై క్రీస్తు పడిన ఘోరబాధ కొరకై యేపు దనరగ
స్తుతులుబాడుచు యేసునాధుని రాకవరకు ఆపకుండగ సత్ప్రసాదము
నందుకొని బలమొంద రండి‖ చేరి ‖
Verse
విందుతో మొదలిడిన సేవ యేసు విందుతో ముగియించె బ్రోవ
విందులోగల మర్మమేదియొ విపులముగ బోధించు క్రీస్తున్ డెందమున
ధ్యానించి యాయన యందె నమ్మిక గలిగియుందము‖ చేరి ‖

Related Tags

WorshipCommunionLords Supper