Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Cherikolvudi Kreesthuni Paadamu

చేరికొల్వుఁడి క్రీస్తుని పాదము

Cherikolvudi Kreesthuni Paadamu

Lyricist: Kaja Ananthamu
Verse 1
చేరికొల్వుఁడి క్రీస్తుని పాదములఁ జేరి కొల్వుఁడి చేరి కొల్వుఁడి
స్థిరమతితో మీ నోరు నిండ మది కోరికఁ దీరఁ‖ జేరి ‖
Verse
ధీరకలితుఁ డుప కారకుఁ డితఁ డని యారూఢిగ మదిఁ గోరి
ప్రియమునఁ‖ జేరి ‖
Verse
జనకుని యుగ్రం బును దా నోరిచి జనులకు మేలు నో సంగి
ఘనునిఁ‖ జేరి ‖
Verse
సార చరిత్రో దారుఁడు పాతక ధీరుఁడు శుద్ధా చారుండితఁడని‖ జేరి ‖
Verse
దేవుని కొమరుఁడు ధీవిస్తారుఁడు సేవ కావనుఁడు క్షేమకరుండని‖ జేరి ‖
Verse
యేసుని వారల నీశుఁడు మన్నన జేసి తప్పు క్షమ చేయునుగానఁ‖ జేరి ‖
Verse
మరణము నొందిన నరులను గృపఁ గ్ర మ్మరఁ బ్రతికించిన
మహిమోజ్వలునిఁ‖ జేరి ‖
Verse
పలు దయ్యంబులఁ బారఁదరిమి రో గుల రక్షించిన మలినాపహునిఁ‖ జేరి ‖
Verse
జను లచ్చెరు వొం దను మూఁగకు నో రును గన్నులు చీఁ కునకిడినాఁ డని‖ జేరి ‖

Related Tags

PraiseWorship