Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Chethuleththi Vandhanamulu Chethu Mipuda

చేతులెత్తి వందనములు చేతు మిపుడ

Chethuleththi Vandhanamulu Chethu Mipuda

Lyricist: Narella Samuyelu Subbayya
Chorus
చేతులెత్తి వందనములు చేతు మిపుడే యేసు నీకు రాతిరి పగ లందు
మముఁ బ్రీతితోఁ గాపాడు యేసు‖ చేతు ‖
Verse
సుఖమైనట్టి నిద్ర మమ్ము నొందఁజేసి రాత్రియందు సకల మేలు లంద
జేయు స్వామి యేసుక్రీస్తూ నీకుఁ‖ చేతు ‖
Verse
అన్నవస్త్రములను మాకు నన్ని వేళలందు నిచ్చి కన్న తండ్రివలెను
బెంచు చున్న యేసుస్వామీ నీకే‖ చేతు ‖
Verse
విద్యా బుద్ధులన్ని యిచ్చి వింత వింత వరము లిచ్చి పెద్దల
దయలోనుమమ్ముఁ బెంపారఁ జేయు మేసయ్యా‖ చేతు ‖
Verse
చిన్నవారి స్నేహితుడుగ నున్న యేసుస్వామీ నీకు ఎన్నో వేల స్తోత్రంబులు
నిలలో నెపుడు కలుగుగాక‖ చేతు ‖

Related Tags

PraiseThanksgiving