Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Chettu Choosthe Pachchagundi

చెట్టు చూస్తే పచ్చగుంది

Chettu Choosthe Pachchagundi

Lyricist: Sailanna
Verse
చెట్టు చూస్తే పచ్చగుంది
పూత లేదు కాత లేదు‖ 2x ‖
వేసినెరువు వ్యర్ధమాయెనా నా యేసయ్యా
రెక్కల కష్టం వృథా ఆయేనా నా యేసయ్యా‖ 2x ‖
Verse
కాపు గాసి కలుపు తీసి నీరు కట్టి పెంచితే‖ 2x ‖
కండ్లెర్రికి చెట్టు పెరిగెనా నా యేసయ్యా
కాత లేదు పూత లేదుగా నా యేసయ్యా‖ 2x చెట్టు ‖
Verse
కాపెంతో గాస్తదని కలలెన్నో కన్నాను‖ 2x ‖
ఫలములెన్నో ఇస్తదని పరవశించి పాడినాను‖ 2x ‖
పూతకంత పురుగు తగిలెనా నా యేసయ్యా
కలలన్ని కల్లలాయెనా నా యేసయ్యా‖ 2x చెట్టు ‖
Verse
పందిరెలుపు తీగ ఉంది కాయ లేదు పండు లేదు‖ 2x ‖
ప్రేమతోని పెంచుకుంటిని నా యేసయ్యా
నరకనీకి ప్రాణమొప్పదు నా యేసయ్యా‖ 2x చెట్టు ‖
Verse
కొత్త కొత్త ఎరువులేసి కొన్ని నాళ్ళు మళ్ళి జూస్తి‖ 2x ‖
పనికిరాని తీగలొచ్చెనా నా యేసయ్యా
పరికి కంపకు పాకిపాయెనా నా యేసయ్యా‖ 2x చెట్టు ‖
Verse
పనికిరాని తీగలన్ని పట్టి కత్తిరించేస్తి‖ 2x ‖
పాడు నాటి పందిరేసి ప్రభుకు అంటు కట్టినాను‖ 2x ‖
కాత పూత ఇవ్వమని కన్నీళ్ళతో ప్రభునడిగితి‖ 2x ‖
పూత కాత బలముగాయెనా నా యేసయ్యా
ఫలాలన్నీ పంచబట్టెనా నా యేసయ్యా‖ 2x చెట్టు ‖

Related Tags

FaithEncouragementFruitfulness