Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Chettuleni Mettalandu Nadula Paarajeyu Deva

చెట్లులేని మెట్టలందు నదుల పారజేయు దేవా

Chettuleni Mettalandu Nadula Paarajeyu Deva

Chorus
చెట్లులేని మెట్టలందు నదుల పారజేయు దేవా
Verse
అడవి బీడుల ఎడారులను ఎండిపోయిన నేలను
ఏదెనుగా మార్చువాడా నాహృదయము మార్చుము
Verse
ఎండియున్న లోయలందు దండిగ జీవనదిన్
మెండుగ ప్రవహింపచేయుము బండయైన క్రీస్తును
Verse
నీటి కాలువ యోరనుండి జీవ వృక్షపుటాకుగా
సాటి మానవకోటిమధ్యను నిల్పుకొమ్ము నీశక్తితో
Verse
శక్తి హీనుడ శాంతిలేక అలసి సొలసియుంటిని
ముక్తిదాత పీషోను గీహోను నదుల పారజేయుము
Verse
సంకుచితమై సమృద్ధిలేక సారహీనుడనైతినే
ఇంక హిద్దెకెలు ఫరాతు నదుల పారచేయుము
Verse
మరణమునకు పాత్రుడనై నిష్ఫలితముగా నుంటిని
పరమ జీవ వృక్షఫలములు ఫలింపజేయు నెల నెలన్

Related Tags

WorshipDevotionalPrayer