Verse
చెవులు ఉన్నాయా – వినే చెవులు ఉన్నాయా?‖ 2x ‖
ఫస్ట్ వినాలి… నెక్స్ట్ నమ్మాలి
చెవులు ఉంటే తప్పక నీవు వినాలి‖ 2x ‖
చెవులు ఉన్నాయా – వినే చెవులు ఉన్నాయా?‖ 2x ‖
విను ఇదే ఆఫర్ వినకపోతే డెంజర్!
యేసు మాట వింటే నీవు బతుకుతావు –‖ 2x ‖
చెవులు ఉన్నాయా – వినే చెవులు ఉన్నాయా?‖ 2x ‖
Verse
సాతాను మాటలా? దేవుని మాటలా?
ఏది వింటావు? ఏది చేస్తావు?
కాకి విన్నది చేప విన్నది
గాడిద విన్నది సృష్ఠి విన్నది‖ 2x ‖
యేసయ్య విన్నాడు ప్రాణం పెట్టాడు
వింటేనే రక్షణ యేసు కర్పణ‖ చెవులు ‖
Verse
ఫ్రెండ్స్ మాటలా? పేరెంట్స్ మాటలా?
ఏది వింటావు? ఏది చేస్తావు?
భూతు మాటలా సినిమా పాటలా
వద్దు బాబోయ్ దురద చెవులు‖ 2x ‖
దేవుని మాటలు వినే చెవులు ఉండాలని
బైబిల్లో మన కోసమే వ్రాయబడినది‖ చెవులు ‖