Verse
చిందింది రక్తం ఆ సిలువ పైన
కారింది రుధిరం కలువరిలోన‖ 2x ‖
కరుణ చూప లేదే కసాయి మనుష్యులు
కనికరించలేదే మానవ లోకం‖ 2x Chindindi ‖
Verse
ఏదేనులో పుట్టిన ఆ పాపము
శాపముగా మారి మరణ పాత్రుని చేసె‖ 2x ‖
ఆ మరణమును తొలగించుటకు
మరణ పాత్రను చేబూనావా‖ 2x ‖
నా మరణమును తప్పించినావా‖ కరుణ ‖
Verse
చేసింది లోకం ఘోరమైన పాపం
మోపింది నేరం నీ భుజము పైనా‖ 2x ‖
యెరుషలేములో పారిన నీ రక్తము
ఈ లోక విమోచన క్రయధనము‖ 2x ‖
ఈ లోక విమోచన క్రయధనము‖ కరుణ ‖
Verse
నువ్వు చేసిన త్యాగం మరువలేని యాగం
మరణపు ముల్లును విరిచిన దేవుడా‖ 2x ‖
జీవకిరీటము నిచ్చుటకై
ముళ్ళ కిరీటము ధరించితివా‖ 2x ‖
నాకు నిత్య జీవమిచ్చితివా‖ కరుణ ‖