Verse
చిన్న చిన్న గొఱ్ఱె పిల్లను
యేసు ప్రియ బిడ్డను‖ 2x ‖
సంతసముగ సాగిపోయెదన్‖ 2x ‖
చెంత యేసు నాతో ఉండగా‖ 2x చిన్న ‖
Verse
ముళ్లపొదలలో నేను నడచి వెళ్లినా
తోడేళ్ళ మధ్యలో సంచరించినా‖ 2x ‖
తొట్రిల్లను నేను చింతించను‖ 2x ‖
తోడుగా నా యేసు ఉండగా‖ 2x చిన్న ‖
Verse
పచ్చికగల చోటికి నన్ను నడుపును
శాంత జలముతో నన్ను తృప్తి పరచును‖ 2x ‖
నా కాపరి నా ప్రియుడేసుడే‖ 2x ‖
చిరకాలము నన్ను కాయును‖ 2x చిన్న ‖