Verse
చిన్న చిన్న గొఱ్ఱె పిల్లను యేసు ప్రియ బిడ్డను
చిన్న చిన్న గొఱ్ఱె పిల్లను యేసు ప్రియ బిడ్డను
సంతసముగ సాగిపోయెదన్‖ 2x ‖
చెంత యేసు నాతో ఉండగా‖ 2x ‖
చిన్న చిన్న గొఱ్ఱె పిల్లను యేసు ప్రియ బిడ్డను‖ 2x ‖
Verse
ముళ్లపొదలతో నేను నడచి వెళ్లినా
తోడేళ్ళ మధ్యలో సంచరించిన‖ 2x ‖
తొట్రిల్లను నేను చింతించను‖ 2x ‖
తోడుగా యేసు నాతో ఉండగా‖ 2x ‖
చిన్న చిన్న గొఱ్ఱె పిల్లను యేసు ప్రియ బిడ్డను‖ 2x ‖
Verse
పచ్చికగల చోటికి నన్ను నడుపును
శాంత జలముతో నన్ను తృప్తి పరచును‖ 2x ‖
నా కాపరి నా ప్రియుడేసుడే‖ 2x ‖
చిరకాలము నన్ను కాయును‖ 2x ‖