Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Chinnaari Baalagaa

చిన్నారి బాలగా

Chinnaari Baalagaa

Verse
చిన్నారి బాలగా చిరుదివ్య జ్యోతిగా
కనరాని దేవుడు కనిపించెనా
తన ప్రేమ నా పైన కురిపించెనా… కురిపించెనా
జో.. లాలిజో.. జో… లాలిజో…
Verse
పరలోక భోగాలు వర దూత గానాలు
తనకున్న భాగ్యాలు విడనాడెనా‖ 2x ‖
పాపాలు భరియించెనా – శాపాలు భరియించెనా
ఆనందమే ఆశ్చర్యమే సంతోషమే సమాధానమే‖ జో లాలిజో ‖
Verse
దావీదు తనయుండై మహిమా స్వరూపుండై
మానుజావతారుండై పవళించెనా‖ 2x ‖
గాఢాంధకారంబున ఒక తార ఉదయించెనా
ప్రభు బాలుడై ప్రభు యేసుడు మరియమ్మ ఒడిలోన నిదురించెనా‖ జో లాలిజో ‖
Verse
శాంతి స్వరూపుండు కరుణా సముద్రుండు
కడు శక్తిమంతుడు కమనీయుడు‖ 2x ‖
ఆశ్చర్యకరుడాయనే ఆలోచన కర్తాయనే
అభిషిక్తుడు ఆరాధ్యుడు ప్రేమామయుడు ప్రియుడేసుడు‖ జో లాలిజో ‖

Related Tags

WorshipChristmasLullaby