Verse
చిన్నబిడ్డల విన్నపముల నెన్నడైన త్రోయక పన్నుగ విను కన్న తండ్రిని
సన్నుతింప జేరరే‖ చిన్న ‖
Verse
భూమి మీద మానవునిగా స్వామి ఉండినప్పుడు ప్రేమతో అనేక
మంది పిల్లల దరి జేర్చెను‖ చిన్న ‖
Verse
చెంత జేర్చి చిన్న పిల్లల చేతులుంచి వారిపై ఎంతో దయతో నాశీర్వ
దించె యేసు వారిని‖ చిన్న ‖
Verse
చిన్న పిల్లల పోలికలను ఎన్నోమార్లు బోధలో ఎన్నుకొనుటలో మనయం
దున్న ప్రేమ దెలిపెను‖ చిన్న ‖
Verse
పాట పాడి ప్రభుని పేర కోటి స్తుతుల నియ్యరే చాటుగను బాహాటముగను
మేటి ప్రభుని వేడరే‖ చిన్న ‖