Chorus
చిన్ని మనసుతో నిన్ను ఆరాధింతును – చిన్ని బిడ్డనేసయ్యా స్వీకరించుము
నీవే నా ప్రాణము నీవే నాధ్యానము – నీవే నాధ్యానము – నీవే నాధ్యానము
Verse
తండ్రి మాటను ధిక్కరించక – తలవంచిన ఇస్సాకు వోలె
విధేయతను నేర్పించుము – వినయముగల మనసివ్వుము‖ 2x ‖
వినయముగల మనసివ్వుము- వినయముగల మనసివ్వుము‖ చిన్ని ‖
Verse
తల్లి మాటను దిక్కరించక – తలవంచిన సమూయేలు వోలె
పరిచర్యను చేయుటకు – నీ స్వరమును నేవినుటకు
నీ స్వరమును నేవినుటకు – నీ స్వరమును నేవినుటకు‖ చిన్ని ‖
Verse
తల్లి ప్రేమకన్నా – తండ్రి ప్రేమ కన్నా – నీ ప్రేమ శ్రేష్టమైనది
నీ ప్రేమలో నిలిచెదను – నీప్రేమలో సాగెదను
నీ సాక్షిగా బ్రతికెదను‖ చిన్ని ‖