Chorus
చింత లేదిఁక యేసు పుట్టెను వింతగను బేత్లెహేమందునఁ చెంత
జేరను రండి సర్వజనాంగమా సంతస మొందుమా‖ చింత ‖
Verse
దూత తెల్పెను గొల్లలకు శుభ వార్త నా దివసంబు వింతగా ఖ్యాతి
మీరఁగ వారు యేసును గాంచిరి స్తుతు లొనరించిరి‖ చింత ‖
Verse
చుక్కఁ గనుగొని జ్ఞాను లెంతో మక్కువతో నా ప్రభుని గను గొన
చక్కఁగా బెత్లెముపురమున జొచ్చిరి కానుక లిచ్చిరి‖ చింత ‖
Verse
కన్యగర్భమునందుఁ బుట్టెను కరుణగల రక్షకుఁడు క్రీస్తుఁడు
ధన్యులగుటకు రండి వేగమె దీనులై సర్వమాన్యులై‖ చింత ‖
Verse
పాప మెల్లను పరిహరింపను పరమ రక్షకుఁ డవతరించెను దాపుఁ
జేరిన వారి కిడుఁ గడు భాగ్యము మోక్షభాగ్యము‖ చింత ‖