Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Chintha Ledika

చింత లేదిక

Chintha Ledika

Lyricist: N D Abel
Verse
చింత లేదిక యేసు పుట్టెను
వింతగను బెత్లేహమందున
చెంత జేరను రండి సర్వ జనాంగమా
సంతసమొందుమా‖ 2x ‖
Verse
దూత తెల్పెను గొల్లలకు
శుభవార్త నా దివసంబు వింతగా
ఖ్యాతి మీరగ వారు యేసును గాంచిరి
స్తుతులొనరించిరి‖ చింత లేదిక ‖
Verse
చుక్క గనుగొని జ్ఞానులేంతో
మక్కువతో నా ప్రభుని కనుగొన
చక్కగా బేత్లేహ పురమున జొచ్చిరి
కానుకలిచ్చిరి‖ చింత లేదిక ‖
Verse
కన్య గర్భమునందు పుట్టెను
కరుణగల రక్షకుడు క్రీస్తుడు
ధన్యులగుటకు రండి వేగమే దీనులై
సర్వ మాన్యులై‖ చింత లేదిక ‖
Verse
పాపమెల్లను పరిహరింపను
పరమ రక్షకుడవతరించెను
దాపు జేరిన వారికిడు గుడు భాగ్యము
మోక్ష భాగ్యము‖ చింత లేదిక ‖

Related Tags

WorshipChristmasNativity