Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Chintha Ledika Yesu Puttenu

చింత లేదిక యేసు పుట్టెను

Chintha Ledika Yesu Puttenu

Verse
చింత లేదిక యేసు పుట్టెను - వింతగను బెత్లెహేమందున
చెంతజేరను రండి సర్వజనంగమా - సంతస మొందుమా‖ చింత ‖
Verse
దూత తెల్పెను గొల్లలకు శుభవార్త నా దివసంబు వింతగా
ఖ్యాతి మీరగ వారు యేసుని గాంచిరి - స్తుతు లొనరించిరి‖ చింత ‖
Verse
చుక్కగనుగొని జ్ఞానులెంతో మక్కువతో నా ప్రభుని గనుగొని
చక్కగా బెత్లెహెము పురమున జొచ్చిరి - కానుక లిచ్చిరి‖ చింత ‖
Verse
కన్య గర్భమునందు బుట్టెను - కరుణ గల రక్షకుడు క్రీస్తుడు
ధన్యులగుటకు రండి వేగమే దీనులై - సర్వమాన్యులై‖ చింత ‖
Verse
పాప మెల్లను పరిహరింపను - పరమ రక్షకుడవతరించెను
దాపు జేరిన వారి కీడు గడు భాగ్యము - మోక్షభాగ్యము

Related Tags

ChristmasNativity