Verse 1
చిరకాల స్నేహితుడా
నా హృదయాన సన్నిహితుడా‖ 2x ‖
నా తోడు నీవయ్యా – నీ స్నేహం చాలయ్యా
నా నీడ నీవయ్యా – ప్రియ ప్రభువా యేసయ్యా
Chorus
చిరకాల స్నేహం – ఇది నా యేసు స్నేహం‖ 2x ‖
Verse
బంధువులు వెలివేసినా
వెలివేయని స్నేహం
లోకాన లేనట్టి ఓ దివ్య స్నేహం
నా యేసు నీ స్నేహం‖ 2x చిరకాల స్నేహం ‖
Verse
కష్టాలలో కన్నీళ్లలో
నను మోయు నీ స్నేహం
నను ధైర్యపరచి ఆదరణ కలిగించు
నా యేసు నీ స్నేహం‖ 2x చిరకాల స్నేహం ‖
Verse
నిజమైనది విడువనిది
ప్రేమించు నీ స్నేహం
కలువరిలో చూపిన ఆ సిలువ స్నేహం
నా యేసు నీ స్నేహం‖ 2x చిరకాల స్నేహం ‖