Verse
పల్లవి: చిరకాల స్నేహితుడా, నా హృదయాన సన్నిహితుడా‖ 2x ‖
నా తోడు నీవయ్యా, నీ స్నేహం చాలయ్యా
నా నీడ నీవయ్యా, ప్రియ ప్రభువా యేసయ్యా
చిరకాల స్నేహం, ఇధి నా యేసు స్నేహం‖ 2x ‖
Verse
బంధువులు వెలివేసిన, వెలివేయని స్నేహం
లోకాన లేనట్టి ఓ దివ్య స్నేహం, నాయేసుని స్నేహం
చిరకాల స్నేహం, ఇధి నా యేసు స్నేహం‖ 2x ‖
Verse
కష్టాలలో, కన్నీళ్లలో, నను మోయు నీ స్నేహం
నను ధైర్యపరచి ఆదరణ కలిగించు, నాయేసుని స్నేహం
చిరకాల స్నేహం, ఇధి నా యేసు స్నేహం‖ 2x ‖
Verse
నిజమైనది, విడువనిధి, ప్రేమించు నీ స్నేహం
కలువరిలొ చూపిన, ఆ సిలువ స్నేహం, నాయేసుని స్నేహం
చిరకాల స్నేహం, ఇధి నా యేసు స్నేహం‖ 2x ‖