Verse
చిరకాలం నీ సన్నిధిలో
చిరునవ్వులతో స్తుతియింతును
నా యేసయ్యా నాయేసయ్యా‖ 2x ‖
Verse
నీ మందిరములో నీ సముఖములో
స్తుతులతో ఆరాధన గొప్పదేవునికీ
ధూపముగా పరమునకు ఎక్కుచుండగా
స్తుతులూ స్వీకరించి మేఘాలు సృజించీ
ఆశీర్వాద వర్షము కురిపిస్తావూ‖ చిరకాలం ‖
Verse
హల్లెలూయ పాటలతో స్తుతియించినచో
మెరుపులతో ఉరుములను పుట్టిస్తావు
తొలకరీ వానగా కడవరీ జల్లులై
నీ దీవెన వర్షాలు కురిపిస్తావు‖ చిరకాలం ‖
Verse
ఆత్మ సంబంధమైన పద్యములన్నీ
దైవాత్మ ఫలములనూ సృష్ఠిస్తావూ
ఆత్మ జల ప్రళయమై స్తూతీ ప్రవాహముగా
కృపాత్మా వర్షాలు కురిపిస్తావూ‖ చిరకాలం నీ సన్నిధిలో ‖