Verse
చిరు దివ్వెల వెలుగులతో
నీ దివ్య కాంతులతో
నను బ్రోవ రావయ్యా
కంటి పాపలా.. నను కాన రావయ్యా‖ 2x ‖
యేసయ్యా.. యేసయ్యా..‖ 2x ‖
నను బ్రోవ రావయ్యా
నను కాన రావయ్యా‖ 2x ‖
ఆ లోయలో… క్రమ్మిన చీకటిలో
ఈ ఇలలో… నిరాశల వెల్లువలో‖ 2x ‖
Verse
దహించివేస్తున్న అవమానము
కరువైపోయిన సమాధానము‖ 2x ‖
పగిలిన హృదయము
కన్నీటి ధారల సంద్రము‖ 2x ‖
ఎగసి పడుతున్న కెరటము
కానరాని గమ్యము‖ 2x చిరు ‖
Verse
ఏకమైన ఈ లోకము
వేధిస్తున్న విరోధము
దూరమవుతున్న బంధము
తాళలేను ఈ నరకము‖ 2x ‖
ఈదలేని ప్రవాహము
చేరువైన అగాధము‖ 4x చిరు ‖