Verse
చిరుగాలి వీచినా ప్రభూ
అది నిన్నె చాటదా
పెనుగాలి రేగినా ప్రభూ
అది నిన్నె చూపదా
Verse
పడే చినుకు జల్లు కూడా
నిన్నే చూపునే‖ 2x చిరు ‖
Verse
దూరానున్న నింగిలో
మేఘాలెన్ని కమ్మెనో‖ 2x ‖
పదాలల్లి నా హృదిలో
అవి వివరించే నీ ప్రేమనే‖ 2x చిరు ‖
Verse
దేవా నీదు ధ్యానమే
జీవాధార మాయెగా‖ 2x ‖
పదే పాడి నీ కృపలన్
నే వివరింతున్ నా యేసువా‖ 2x చిరు ‖