Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Chitikina Naa Jeevithamu Chinigina O Kaagithamu

చితికిన నా జీవితము చినిగిన ఓ కాగితము

Chitikina Naa Jeevithamu Chinigina O Kaagithamu

Verse
చితికిన నా జీవితము చినిగిన ఓ కాగితము
నా గుండె పగిలేనయ్యా నా మనసు విరిగేనయ్య
Verse
నా ఆశ నీవే కావా నా మార్గములు నీవేగా
నీ చేతితోనే నన్ను నడిపించుమా నా యేసు
Verse
అలనాడు దానియేలు బబులోను దేశములో
నీ పక్షముగా నిలబడినాడు
నా ఆశ అదియే దేవా
నా మార్గము అదియే
నీ మాటతోనే నన్ను బ్రతికించుమా నా యేసు
Verse
అలనాడు యోబును శ్రమలన్నిటి మధ్యన
నడిపించినావా దేవా
నా ఆశ అదియే దేవా
నా మార్గము అదియే
విశ్వాసముతో నన్ను చిగురింపచేయుము దేవా
Verse
అలనాడు పౌలును నీ రెక్కల నీడలో కాపాడినావా దేవా
నా ఆశ అదియే దేవా
పరిశుద్దతతో నన్ను కడవరకు నడిపించు

Related Tags

SurrenderGuidance