Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Choochi Jeevinchu Yesunaathuni Gaayamulanu Choodumu

చూచి జీవించు యేసునాథుని గాయములను చూడుము

Choochi Jeevinchu Yesunaathuni Gaayamulanu Choodumu

Verse
యేసునాథుని గాయములను చూడుము - నిత్యజీవము పొందెదవు
ప్రాణమిచ్చి విమోచించిన వానిని - నమ్మివచ్చి చేరి చూడుము
Chorus
చూచి జీవించు - యేసునాథుని గాయములను చూడుము
నిత్యజీవము పొందెదవు
Verse
పాపభారము మోసిన రక్షకునిచే - నీ నేరము తొలగెన్
జీవనాథుడు కార్చిన రక్తముచే - నీ పాప ఋణము తీరెన్
Verse
ఏ క్రియలు ప్రార్థన కన్నీళ్ళును - ఇన్ను రక్షింపజాలవు
రక్తంబే ఆశ్రయమని వచ్చిన - కరుణించు విమోచకుడు
Verse
పాప ప్రాయశ్చిత్త క్రియలు ముగిసె - అని ప్రభువే పల్కెను
సర్వలోకపు నేర పాపమున్ - సిలువలో నివృత్తి జేసెన్
Verse
పాపనాశకుడు ఇచ్చు రక్షణను - ఈ క్షణమే పట్టుకొనుము
నీ నీతియగు యేసు పుణ్యముచే - మోక్షానందముల పొందెదవు

Related Tags

InvitationGospelSalvation