Verse
చూచితి నీ మోముపై – చిందిన రక్తము
తలచితి నీ ప్రేమను – మదికి అందనిదాయె
రాజ మకుటము మారిపోయే – ముళ్ల మకుటముగా
సింహాసనమే సిలువగ మారి – శిక్షకు గురియాయేగా
పరిమితి లేని కలువరి ప్రేమను – పరిహాసము చేసిరే
ఆ ప్రేమనెరిగి నీ పాద సేవయే – చాలని నీ చెంత చేరితిని
యేసు..‖ చూచితి ‖
Verse
నేలపై ఒలికిన నీ రక్తధారలే – ప్రతి పాపిని కడిగెను
ఆ రక్తధారలే పాపికి మార్గమై – పరముకు ప్రవహించెను‖ 2x ‖
మట్టి దేహమును – మహిమగ మార్చుటకు‖ 2x ‖
మాపై నీకున్న సంకల్ప ప్రేమను – పరిహాసము చేసిరే‖ 2x ‖
యేసు..‖ చూచితి ‖
Verse
సిలువలో చిందిన రక్తపు జల్లులు – ప్రతి రోగిని తాకెను
చితికిన దేహమున ఒలికిన రుధిరము – పరమౌషధమాయెను‖ 2x ‖
మా రోగములను – భరియించుటకు‖ 2x ‖
మాపై నీకున్న ఎనలేని ప్రేమను – అవహేళన చేసిరే‖ 2x ‖
యేసు..‖ చూచితి ‖