Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Choochithi nee momupai chindhina rakthamu

చూచితి నీ మోముపై చిందిన రక్తము

Choochithi nee momupai chindhina rakthamu

Lyricist: Jyothi Raju
Verse
చూచితి నీ మోముపై – చిందిన రక్తము
తలచితి నీ ప్రేమను – మదికి అందనిదాయె
రాజ మఖుఠము మారిపోయే – ముళ్ల ముఖుఠముగా
సింహాసనమే శిలువగ మారే – శిక్షకు గురియాయేగా
పరిమితి లేని కలువరి ప్రేమను – పరిహాసము చేసిరే
ఆ ప్రేమనెరిగి నీ పాద సేవయే – చాలని నీ చెంత చేరితిని యేసు
నేలపై ఒలికిన నీ రక్త ధారలే – ప్రతి పాపిని కడిగెను
ఆ రక్త ధారలే పాపికి మార్గమై – పరముకు ప్రవహించెను
మట్టి దేహమును – మహిమగ మార్చుటకు
మాపై నీకున్న సంకల్ప ప్రేమను – పరిహాసము చేసిరే
సిలువలో చిందిన రక్తపు జల్లులు – ప్రతి రోగిని కడిగెను
చితికిన దేహమున ఒలికిన రుధిరము – పరమౌషధమాయెను
మా రోగములను – భరియించుటకు
మాపై నీకున్న ఎనలేని ప్రేమను అవహేళన చేసిరే

Related Tags

SacrificeJesusCalvaryBlood