Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Choochuchunna Devudavayya Nannu

చూచుచున్న దేవుడవయ్యా నన్ను

Choochuchunna Devudavayya Nannu

Verse
చూచుచున్న దేవుడవయ్యా నన్ను చూచినావు‖ 2x ‖
నీ పేరు మిటో ఎరుగనయ్యా‖ 2x ‖
నా పేరుతో నన్ను పిలిచావయ్యా‖ 2x Choochuchunna ‖
Verse
శారాయి మాటలే విన్నాను
అబ్రహాము భార్యనై య్యాను‖ 2x ‖
ఈ అరణ్య దారిలో ఒంటరినై‖ 2x ‖
దిక్కులేక తిరుగుతున్న హాగరును
నేను హాగరును‖ చూచుచున్న ‖
Verse
ఇష్మాయేలుకు తల్లినైతిని
అయినవారితో త్రోసివేయబడితిని‖ 2x ‖
కన్నకొడుకు మరణము చూడలేక‖ 2x ‖
తల్లడిల్లిపోతున్న తల్లిని నేను
అనాథ తల్లిని నేను‖ చూచుచున్న ‖
Verse
పసివాడి మొరను ఆలకించావు
జీవజలములనిచ్చి బ్రతికించావు‖ 2x ‖
నీ సంతతిని దీవింతునని‖ 2x ‖
వాగ్దానమిచ్చిన దేవుడవు
గొప్ప దేవుడవు‖ చూచుచున్న ‖

Related Tags

Gods CarePromise