Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Choochuchunnaamu Nee Vaipu Maa Priya

చూచుచున్నాము నీ వైపు మా ప్రియ

Choochuchunnaamu Nee Vaipu Maa Priya

Lyricist: Pulipaka Jagannadhamu
Chorus
చూచుచున్నాము నీ వైపు మా ప్రియ జనక చూచుచున్నాము
నీవైపు చూచుచు నీ ప్రేమ సొంపు సువార్తను జాఁచుచుఁ గరములు
చక్కఁగా నీవైపు‖ చూచు ‖
Verse
మేమరులమై యుంటిమి మార్గము వీడి మేమందరము పోతిమి
ప్రేమచే నప్పుడు ప్రియ తనయ నంపించి క్షేమమార్గము మాకుఁ
బ్రేమను జూపితివి‖ చూచు ‖
Verse
నిను నమ్ము పాపులకు వారెవరైన నీ శరణుఁ జొచ్చువారలకు
ఇనుఁడవు కేడెంబు నీ జగతిలో నగుచుఁ గనుపరచుచుందువు ఘన
మైన నీ కృపఁ‖ చూచు ‖
Verse
నీ భయము మాయెదలను నిలుపుము నీదు ప్రాభవ మొనరంగను
నీ భయముచే మేము వైభవ మొందుచు నే భయము లేకుండ నీ భువిని
గొన్నాళ్ళు‖ చూచు ‖
Verse
దయఁజూచి మము నెప్పుడు మంచివి యన్ని దయచేయు మెల్లప్పుడు
దయచేయరానివి దయచేయుమని కోరఁ దయజూపి మన్నించు దయగల
మా తండ్రి‖ చూచు ‖

Related Tags

WorshipDevotionalPrayer