Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Chooda Goreda Deva Mandiraavaranamu-lanu

చూడ గోరెద దేవ మందిరావరణములను

Chooda Goreda Deva Mandiraavaranamu-lanu

Lyricist: M J Ramanjulu
Chorus
చూడ గోరెద దేవ మందిరావరణములను చూడ గోరెద
చూడ నాకు నాశ గలదు సుందరావరణములవి
చూడ నాదు ప్రాణమెంతో సొమ్మసిల్లుచున్నదహా‖ చూడ ‖
Verse
నీదు నివాసములు జూడ నెంతో రమ్యమై తనర నాదు హృదయమునకు
నానంద మిచ్చు నిపుడు నెపుడు‖ చూడ ‖
Verse
జీవము గల ప్రభుని జూడ జీవి నాలో కేక వేసె కోవెలలకు దొఱికె
గూటి తావు నీ మందిరమున‖ చూడ ‖
Verse
పిచ్చుకలకు దొఱికె స్థలము ముచ్చట బలిపీఠ మెదుట పెట్టు
కుతూహలముతోను పిల్లల నవి మందిరమున‖ చూడ ‖
Verse
నీదు మందిరంబులోన నిత్యవాసులైనవారు నిక్కముగను ధన్యులగుచు
నిన్ను నన్నుతింతు రహా‖ చూడ ‖
Verse
ప్రభుని వలన బలము నొందు ప్రజలు ధన్యులగుదు రిల
ప్రాణ ప్రియము యాత్ర సేయు ప్రజల మార్గ మమర ధరను‖ చూడ ‖
Verse
నీదు యావరణములలో నేను నొక్క దినము గడుప నెంతో విలువ గల
నాకు వేయినాళ్ల బ్రతుకు కన్న‖ చూడ ‖
Verse
కానరండు మనము నిపుడె మనము లలర ప్రభుని జూడ మందిరమున
కేగి నిండు మనశ్శాంతి బొంది బ్రతుక‖ చూడ ‖

Related Tags

WorshipDevotion