Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Choodare Kreesthuni Joodare Naa Sakhula

చూడరే క్రీస్తుని జూడరే నా సఖుల

Choodare Kreesthuni Joodare Naa Sakhula

Lyricist: Purushothamu Choudari
Chorus
చూడరే క్రీస్తుని జూడరే నా సఖులార చూడరే క్రీస్తుని జూడరే
చూడరే నాముక్తి పదవికి ఱేఁడు యేదశఁ గూడినాఁడో‖ చూడరే ‖
Verse
మించి పొంతి పిలాతు సత్య మొ కించుకైనఁ దలంప కక్కట వంచనను
గొట్టించి యూదుల మంచితనమే కోరి యప్ప గించెనా మేలు గ
ణించెనా ఇతనిఁ గాంచి కాంచి భక్తులెట్లు స హించిరో పరికించి మీరిది‖ చూడరే ‖
Verse
మంటికిని నాకాశమునకును మధ్యమున వ్రేలాడుచుండఁగ నంటఁ
గొట్టఁగ సిలువ మ్రాని కప్పగించుటకొరకు నిన్నుఁ గాంచెనా యిది
మది నెంచెనా హా నా కంట నే నిటువంటి యాపదఁ గంటిఁ
బ్రాణము లుండునే యిఁకఁ‖ చూడరే ‖
Verse
ఊటగా రక్తంబు కారుచు నుండ బల్లెపుఁ బ్రక్కపోటు మాటిమాటికిఁ
జూడ దుఃఖము మరలునే తలమీఁద ముళ్లకి రీటమా యితనికి
వాటమా యూదులు మోటులై బాహాటమున నీ పాటులను గాటముగఁ
జేసిరి‖ చూడరే ‖

Related Tags

Good FridayPassion Of ChristLent