Verse
చూడరే మాఱేఁడు పుట్టి నాఁడు బెత్లెహేములో నేఁడీ భూమి
వాసులకు నిండు రక్షణబ్బెను‖ చూడరే ‖
Verse
ఎన్నరాని దేవ దీప్తి మున్ను మిన్ను గ్రమ్మెను పన్నుగా రేయెండ కాంతి
కన్ననది మించెను‖ చూడరే ‖
Verse
దూత తెల్పె వ్రేల కొక ప్రీతియగు ముచ్చటన్ ఖ్యాతిగ దావీదు పురిని
కర్తయేసు పుట్టుటన్‖ చూడరే ‖
Verse
తూరుపున జ్ఞానులొక్క తార దివిని గాంచిరి వారు వీరు వచ్చి సేవ
వరుసగాను జేసిరి‖ చూడరే ‖
Verse
మక్కువతో మనమెల్ల మ్రొక్కి సేవఁ జేతుము మిక్కుటముగ మనకు
శాంతిఁ గ్రక్కున నొసంగును‖ చూడరే ‖