Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Choodare Siluvanu

చూడరే సిలువను

Choodare Siluvanu

Lyricist: Ongole Abraham
Verse
చూడరే సిలువను వ్రే-లాడు యేసయ్యను
పాడు లోకంబునకై – గోడు జెందె గదా‖ చూడరే ‖
Verse
నా చేతులు చేసినట్టు – దోషంబులే గదా
నా రాజు చేతులలో ఘోరంపు జీలలు‖ చూడరే ‖
Verse
దురితంపు దలఁపులే – పరమ గురిని శిరముపై
నెనరు లేక మొత్తెనయ్యొ – ముండ్ల కిరీటమై‖ చూడరే ‖
Verse
పరుగెత్తి పాదములు – చేసిన పాపంబులు
పరమ రక్షకుని – పాదములలో మేకులు‖ చూడరే ‖
Verse
పాపేఛ్చ తోడ గూడు – నాడు చెడ్డ పడకలే
పరమ గురుని ప్రక్కలోని – బల్లెంపు పోటులు‖ చూడరే ‖

Related Tags

WorshipRepentanceGood Friday