Chorus
చూడరే సిలువను వ్రే లాడు యేసయ్యను పాడు లోకంబునకై గోడు
జెందెఁ గదా‖ చూడరే ‖
Verse
నా చేతలు చేసినట్టి దోషంబులే గదా నా రాజు చేతులలో ఘోరంపు
జీలలు‖ చూడరే ‖
Verse
దురితంపు దలఁపులే పరమగురిని శిరముపై నెనరు లేక మొత్తెనయ్యో
ముండ్ల కిరీటమై‖ చూడరే ‖
Verse
పరుగెత్తి పాదములు చేసిన పాపంబులు పరమ రక్షకుని పాదములలో
మేకులు‖ చూడరే ‖
Verse
పాపేచ్ఛ తోడఁ గూడు నాదు చెడ్డ పడకలే పరమగురుని ప్రక్కలోని
బెల్లంపు పోటులు‖ చూడరే ‖