Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Choodumade Nee Korake Siluvapai Vrelaadu Sreeyesu Rakshakun

చూడుమదే నీ కొరకే సిలువపై వ్రేలాడు శ్రీయేసు రక్షకున్

Choodumade Nee Korake Siluvapai Vrelaadu Sreeyesu Rakshakun

Chorus
చూడుమదే నీ కొరకే
సిలువపై వ్రేలాడు శ్రీయేసు రక్షకున్
Verse
నలుగ గొట్టబడి నీకై - పలుకకుండె మారుగా
శిరస్సున రక్తధారలు విరిచె రెక్కలను గ్రుచ్చ
నీ పాపమే, పాదములను - చీల్చెను, బల్లెమై ప్రక్కన్ బొడిచె
Verse
రక్తసిక్తమై మోము - ఎఱ్ఱనయ్యె కొయ్యపై
చూడు వీపున దున్నెను - దీనునిగా జేసె నీ పాపమే
ప్రభు రక్తము ఏరులై - పారెను, నీ కొరకే సిలువపై
Verse
గాయమైన చేతులన్ - దినమెల్ల చాపెనో పాపీ
చూచుచుండె ప్రేమతో - నీకై కన్నెటిని కార్చుచు
తన కృపతో, సంధించును - పాపి నిను, చేరుచెంతన్ నీక్షణమే
Verse
ఎంతకాల మేడ్పించి - వెలుపలనుంతు వతనిని
తెరువు హృదయ ద్వారమున్ - పొందు మారుమనస్సును
ఈ దినమే, నీ పాపముల్ క్షమియించును - నీకిచ్చు సురక్షణను

Related Tags

SalvationGood FridaySacrificePassion