Verse
చూడుము ఈ క్షణమే కల్వరిని
ప్రేమా ప్రభువు నీకై నిలుచుండెను
గొప్ప రక్షణనివ్వ శ్రీ యేసుడు
సిలువలో వ్రేలాడు చున్నాడుగా
Verse
మానవు లెంతో చెడిపోయిరి
మరణించెదమని తలపోయక
ఎరుగరు మరణము నిక్కమని
నరకమున్నదని వారెరుగరు
Verse
ఇహమందు నీకు కలవన్నియు
చనిపోవు సమయాన వెంటరావు
చనిపోయినను నీవు లేచెదవు
తీర్పున్నదని ఎరుగు ఒక దినమున
Verse
మనలను ధనవంతులుగా చేయను
దరిద్రుడాయెను మన ప్రభువు
రక్తము కార్చెను పాపులకై
అంగీకరించుము శ్రీ యేసుని
Verse
సిలువపై చూడుము ఆ ప్రియుని
ఆ ప్రేమకై నీవు యేమిత్తువు
అర్పించుకో నీదు జీవితము
ఆయన కొరకై జీవించుము