Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Choodumu Gethsemane Thotalo Naa Prabhu

చూడుము గెత్సెమనే తోటలో నా ప్రభ

Choodumu Gethsemane Thotalo Naa Prabhu

Verse 1
చూడుము గెత్సెమనే తోటలో నా ప్రభువు
పాపి నాకై వి జ్ఞాపన చేసెడి ధ్వని వినబడుచున్నది
పాపి నీకై విజ్ఞాపన చేసెడి ధ్వని వినబడుచున్నది
Verse
దేహమంతయు నలగి శోకము చెందినవాడై
దేవాది దేవుని ఏకైక సుతుడు పడు వేదనలు నా కొరకే
Verse
తండ్రి ఈ పాత్ర తొలగున్ నీ చిత్తమైన యెడల
ఎట్లయినను నీ చిత్తము చేయుటకు నన్నప్పగించితివనెను
Verse
రక్తపు చెమట వలన మిక్కిలి బాధనొంది
రక్షకుడేసు హృదయము పగులుగ విజ్ఞాపనము చేసెనే
Verse
ముమ్మారు భూమిమీదపడి మిక్కిలి వేదనచే మన యేసు
ప్రభువు తానే వేడుకొనెను పాపుల విమోచన కొరకే
Verse
ప్రేమామృత వాక్కులచే ఆదరించెడి ప్రభువు వేదన
సమయమున బాధపరచెడి వారి కొరకు ప్రార్థన చేసెను
Verse
నన్ను తనవలె మార్చెడి ఈ మహా ప్రేమను తలచి
తలచి హృదయము కరుగగ సదా కీర్తించెదను‖ చూడు ‖

Related Tags

PrayerSacrificePassionLent