Verse
చూడుము నీవు మేలుకొనుము యేసు వచ్చుచున్నాడు
అంధకార రాజ్యమున కా రాజు మహిమతో వచ్చును
Verse
హృదయ ద్వారమును తెరువు యేసు తట్టుచున్నాడు
నేడే నిన్ను పిలుచుచుండె ఆలస్యము చేయకుము
Verse
నేడే వినుము సువార్తను పొందు గొప్పరక్షణ
రాదు తరుణము లేదు మరల - మరణము నిన్ను కొనిపోవున్
Verse
విడువుము అంధకార త్రోవ విడువుము నీ చెడు జీవితము
నేడే యేసును విశ్వసించి - నడువ నాయత్తపడుము
Verse
పాపడాగులనేకములు అపాయ మతి నీచములు
పాపములేని యేసురక్తము - పాపములన్ని కడుగును
Verse
కల్వరి సిలువపై చూడుమా జీవమైన రక్షకుని
నీవు పొందుము నిత్యజీవము - లేచి పాడుము హల్లెలూయ